తెలుగు రేడ నేను తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స.
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు
తెలుగు, భారత దేశములోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష, మరియు దాని పక్క రాష్ట్రములయిన తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, చత్తీస్ గఢ్ ప్రజలు మాట్లాడే భాష. ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడే వాటిలో పదిహేనవ స్థానములోనూ, భారత దేశములో రెండవ స్థానములోను నిలుస్తుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం సుమారుగా ఏడుకోట్ల ముప్పై లక్షల మంది ఈ భాషను మాట్లాడతారు.
భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించినారు. అనగా తెలుగు హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలగు భాషలు చెందు ఇండో ఆర్య భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, తమిళము, కన్నడము, మళయాళము, తోడ, తుళు, నేపాలీ, బ్రహుయి మొదలగు భాషలతోపాటుగా ద్రవిడ భాషా వర్గమునకు చెందును.
లెక్కవేస్తే సుమారుగా ౨౧ కి తగ్గకుండా ఈ ద్రవిడ భాషా వర్గము చెందిన భాషలు భారత దేశములో ఉన్నాయి, మరియు కొన్ని ద్రవిడ భాషా వర్గమునకు చెందిన భాషలు పాకిస్తాన్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను మాట్లాడబడుతున్నాయి, బ్రహుయి అటువంటి వాటిలో ఒకటి, దీనిని పాకిస్తాన్లో మాట్లాడతారు.
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు, ఆరవ శతాబ్దము ముందటి తెలుగు చరిత్రకు సంబంధించి మనకు ఎటువంటి ఆధారాలూ లభించలేదు. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు. మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. క్రీస్తు శకం 19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యం పెరిగినది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.
తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా, తేలికగా అంగీకరిస్తుంది. సంస్కృతము ప్రభావము తెలుగు సాహిత్యముపై చాలా ఎక్కువ. సంస్కృతము చూపించినంత ప్రభావము ఇంక ఏ భాష కూడా తెలుగు భాషపై చూపలేదు. నిజానికి తెలుగు లిపిలో చాలా అక్షరములు, ముఖ్యముగా (aspirated?) హల్లులు కేవలం సంస్కృతము కోసమే లిపిలోనికి తీసుకొనబడినాయి. "మంచి సంస్కృత ఉచ్చారణ కోస్తా ప్రాంతములోని పండితుల దగ్గర వినవచ్చు" అని చెప్పడం అతిశయోక్తి కాదు.
సంస్కృతము తెలుగు సాహితీ ప్రపంచంలో ఓ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నట్లే, పర్షియను, ఉర్దూ పదాలు కూడా తెలుగు కార్యనిర్వాహక పదబందములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి. బ్రిటీషు వారి పరిపాలనవల్ల, మరియు సాంకేతిక విప్లవం వల్ల ఈ రోజుల్లో ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కూడా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఇంగ్లీషు పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుకోలేరు అని చెప్పడం సత్యదూరం కాదు. భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (Genetic) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి జాతీయ భాష కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పడము ఆశ్చర్యకారణము కాదు.
తెలుగువారికి ఇంగ్లీషు అంటే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ భాషాశాస్త్రపరంగా, సంస్కృతీపరంగా, వ్యాకరణ పరంగానూ ఈ రెండు భాషలూ చాలా దూరంలో ఉంటాయి. తెలుగులో వాక్యం లో కర్త-కర్మ-క్రియ అవే వరుసలో వస్తాయి, కానీ ఇంగ్లీషు నందు మాత్రము కర్త-క్రియ-కర్మ గా వస్తాయి. ఇంగ్లీషు మాట్లాడువారికి తెలుగులో పదాల వరుస వ్యతిరేకదిశలో ఉంటాయి. ఇంకా చాలా తేడాలు ఉన్నాయి, ముఖ్యముగా past perfect Tense విషయములో.
భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటిలోనూ పోటీ పడుతుంది. ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో ఇది ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతిశుద్ధంగానూ ఉంటుంది. అచ్చులో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతంలోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తనలతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" (Italian of the east) అని పిలుచుకున్నారు. (నిజానికి ఇటాలియను కంటే తెలుగు పురాతనమైనది, కాబట్టి మనము ఇటాలియనును "తెలుగు ఆఫ్ యూరోపు" అని పిలుచుకోవచ్చు!).
తెలుగు (మరియూ ఇతర భారతదేశ బాషలలోని) ఓ ప్రముఖమైన విషయము ఏమిటంటే సంధి. రెండు పదాలు పక్కపక్కన చేర్చి పలికినప్పుడు మనకు క్రొత్త మూడవ పదము వస్తుంది.
బెరడ, దాసరి, దొమ్మర, గొలరి, కమతి, కోమటి, కొండ రెడ్డి, సాలేస్వరి, తెలంగాణా, తెలుగు, వడగ, వడరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, రాయల సీమ, నెల్లూరు, గుంటూరు, సాలెం, కోయంబత్తూరు, మద్రాసు, మరియూ విరుధునగరం, టుటికోరిను, మధురయి, తంజావూరు,
తెలుగు నకు ఈ క్రింది యూనీకోడు బ్లాకు ఇవ్వబడినది 0C00-0C7F (3072-3199).
| 0 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | A | B | C | D | E | F | |
| C00 | -- | -- | -- | -- | -- | a, అ | A, ఆ | i, ఇ | I, ఈ | u, ఉ | U, ఊ | R, ఋ | -- | -- | e, ఎ | E, ఏ |
| C10 | ai, ఐ | -- | o, ఒ | O, ఓ | ou, ఔ | ka, క | kha, ఖ | ga, గ | gha, ఘ | -- | ca, చ | cha, ఛ | ja, జ | jha, ఝ | -- | Ta, ట |
| C20 | Tha, ఠ | Da, డ | Dha, ఢ | Na, ణ | ta, త | tha, థ | da, ద | dha, ధ | na, న | -- | pa, ప | pha, ఫ | ba, బ | bha, భ | ma, మ | ya, య |
| C30 | ra, ర | -- | la, ల | La, ళ | -- | va, వ | Sa, శ | sha, ష | sa, స | ha, హ | -- | -- | -- | -- | -- | -- |